top of page

సన్రైజర్స్ హైదరాబాద్ పై సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్


సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పై సూపర్ ఓవర్లో గెలిచింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 159 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్ళింది. ఈ సీజన్లో ఇది ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్.

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా దాటిగా పరుగులు చేశారు. ముఖ్యంగా పృథ్వీ షా సన్రైజర్స్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వీరిద్దరూ మొదటి వికెట్ కి 80 పరుగులు జోడించారు. 11వ ఓవర్లో మొదటి బాల్ కి రషీద్ ఖాన్ బౌలింగ్ లో శిఖర్ ధావన్(28) వికెట్ల మీదకు ఆడి అవుట్ అయ్యాడు. తర్వాత ఓవర్లో జోరుమీదున్న పృథ్వీ షా(53) రన్నవుట్ అయ్యాడు. రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడడం తో ఢిల్లీ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ స్టీవ్ స్మిత్ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 42 పరుగులు జోడించారు. 19 ఓవర్ సిద్ధార్థ్ బౌలింగ్లో లో రిషబ్ పంత్(37) హెట్మేయర్‌(1) అవుట్ అయ్యారు. అయితే చివరి ఓవర్లో స్టీవ్ స్మిత్ (34) ఖలీల్ బౌలింగ్లో 6 ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 159 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది.


159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్ళింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్ లో విలియంసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్(6), బెయిర్‌స్టో(38) ధాటిగా ప్రారంభించిన పవర్ ప్లే లోనే అవుట్ కావడంతో సన్రైజర్స్ పై ఒత్తిడి పెరిగింది. వార్నర్ లేని పరుగు కోసం రన్నవుట్ అయ్యాడు. బెయిర్ స్టో భారీ షాట్కు ప్రయత్నించి ఆవిష్ ఖాన్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో విలియంసన్ స్పూర్తిదాయక ఆటతో చివరి వరకు ఉండి జుట్టు ని గెలిపించే

ప్రయత్నం చేశాడు కానీ అతనికి మిగతా బ్యాట్స్మెన్ ఎలాంటి సహకారం అందించలేదు విరాట్ సింగ్ బాల్స్ పూర్తిగా మింగేశాడు. అయితే 19 ఓవర్లలో విజయ శంకర్ అవుట్ అయిన తర్వాత వచ్చిన సుజిత్ రెండు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు.ఇక చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం మొదటి బాల్ కి రబడ వైడ్ వేశాడు. నెక్స్ట్ బాల్ విలియంసన్ ఫోర్ కొట్టాడు తర్వాత సింగిల్ తీశాడు. ఇక నాలుగు బంతుల్లో పది పరుగులు అవసరం. ఈ దశలో సుజిత్ సిక్స్ కొట్టడంతో సన్రైజర్స్ పోటీలో కి వచ్చింది.మొదటి ipl మ్యాచ్ ఆడుతున్న సుజిత్ ఒత్తిడి లో చక్కటి షార్ట్స్ ఆడాడు ఇక మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం సుజిత్ నాలుగో బంతికి సింగిల్ తీశాడు.

రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం. ఐదో బంతికి విలియమ్సన్ సింగల్ తీశాడు. ఒక బంతికి రెండు పరుగులు అవసరం ఆరో బంతికి కూడా సింగిల్ తీయడంతో మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్ లో సన్రైజర్స్ హైదరాబాద్ 7 పరుగులు మాత్రమే చేసింది వార్నర్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు విలియంసన్ ఒక ఫోర్ కొట్టి 4 పరుగులు చేశాడు వే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 8 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది మూడో బంతికి రిషబ్ పంత్ ఫోర్ కొట్టి ఒత్తిడి తగ్గించాడు.నాలుగో బంతికి పరుగులు రాలేదు. ఇక వరుసగా రెండు బంతుల్లో రెండు సింగిల్స్ తీసి మ్యాచ్ ని గెలిపించారు


Please follow me on social media click the social media Icons on top to follow me thank you

Comments


bottom of page