top of page

జడ్డు అల్ రౌండ్ షో CSK ఘన విజయం


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో ఆటో బౌలింగ్లో ఆల్ రౌండ్ షో ప్రదర్శించడంతో పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. .దీంతో చెన్నై పాయింట్ల పట్టిక లో మొదటి స్థానం లోకి వెళ్ళింది..



టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా ఆఖరి ఓవర్లో 37 పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధించింది CSK నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఋత్ రాజ్ గైక్వాడ్ డుప్లెసిస్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్ కి 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గైక్వాడ్(33) చాహల్ బౌలింగ్ లో అవుట్ అవడంతో తో చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది . ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా(24) కూడా ధాటిగా ఆడటంతో చెన్నై స్కోర్ బోర్డు పరిగెత్తింది. ఈ క్రమంలో డుప్లెసిస్ (50)హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ హర్షల్ పటేల్ బౌలింగ్ లో వరుస బంతుల్లో అవుట్ అవ్వడం తో పరుగుల వేగం తగ్గింది. రాయుడు (14) అవుట్ అయినా జడేజా చివరి ఓవర్లో 5 సిక్సర్లు ఒక ఫోర్ తో పాటు ఒక నోబల్ పడడంతో మరో రెండు పరుగులు చేశాడు .మొత్తం మీద ఆ ఓవర్లో 37 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో జడేజా 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 15 ఓవర్లో సుందర్ బౌలింగ్లో జడేజా ఇచ్చిన క్యాచ్ క్రిస్టియన్ వదిలేయడంతో ఆర్సిబి భారీ మూల్యం చెల్లించుకుంది. జడేజా చెన్నై పై సిక్సల వర్షం కురిపించాడు. జడేజా 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు



192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ ఓపెనర్ విరాట్ కోహ్లీ, దేవ్ దత్ పడిక్కాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు దేవ్ దత్ పడిక్కాల్ మొదటి నుంచి భారీ షాట్లు కొడుతూ స్కోర్ ని పరిగెత్తించాడు వీరిద్దరూ మొదటి వికెట్ కి 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో ఓవర్ మొదటి బంతికి కోహ్లీ (8)అవుట్ కావడంతో శ్యామ్ కరణ్ చెన్నైకి మొదటి వికెట్ అందించాడు . ఆ తర్వాతి ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో దేవ్ దత్ పడిక్కాల్ (34) అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి కి బెంగుళూరు స్కోర్ 65/2 గా ఉంది . అప్పటికీ మాక్స్వెల్, డి విల్లెర్స్ ఉండడంతో RCB పోటీ లోనే ఉంది. కానీ స్పిన్నర్లు బౌలింగ్ కి దిగడంతో మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతుల్లోకి వెళ్ళిపోయింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన జడేజా బౌలింగ్ లో మూడు వికెట్లు తీసి ఆర్ సి బి ని కోలుకోలేని దెబ్బ తీశాడు. జడ్డు కీలకమైన మాక్స్వెల్, డి విల్లెర్స్ తో పాటు సుందర్ (7)నీ అవుట్ చేశాడు. అలాగే జడ్డు

డానియల్ క్రిస్టియన్ (1)ని రనౌట్ చేశాడు. స్ట్రైట్ బంతులతో మ్యాక్స్వెల్ (22), డి విల్లెర్స్(4) నీ బౌల్డ్ చేశాడు. దాంతో మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతిలోకి వెళ్ళిపోయింది ఇమ్రాన్ తాహిర్ కూడా రెండు వికెట్లు తీశాడు. ఒక దశలో 65/2 గా ఉన్న బెంగళూరు స్కోరు 87/7 గా మారిపోయింది ఆర్ సి బి 100 లోపే ఆల్ అవుట్ అవుతుందనుకున్న దశలో చాహల్(8) , జెమీసోన్(16), సిరాజ్(12) లు పూర్తి ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి స్కోరు నీ 122 పరుగుల వద్ద ముగించాడు

Please follow on social media and share to your friend more technology information select English language in menu


Budget gaming mobile


Komentáre


bottom of page