top of page

పంజాబ్ కింగ్స్ ఫై కోల్కటా నైట్ రైడర్స్ విజయం


పంజాబ్ కింగ్స్ ,కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పంజాబ్ ఫై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాప్ కోల్పోయి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(31) టాప్ స్కోరర్. పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్

కె.ఎల్.రాహుల్ తొలి వికెట్ కి 36 పరుగులు జోడించారు. రాహుల్(19) 7 వ ఓవరులో కమ్మిన్స్ బోలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే క్రిస్ గేల్(0) కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శివం మావి క్రిస్ గేల్ ఔట్ చేశాడు. ఎనిమిదో ఓవరులో దీపక్ హూడా(1) అవుట్ కావడంతో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ కూడా అవుట్ కావడంతో పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేదు. పూరన్ 19 పరుగులు చేసాడు. చివర్లో జోర్డాన్(30) భారీ షాట్ కొట్టి పంజాబీ పంజాబ్ స్కోర్ ని 100 దాటించాడు లేకుంటే 100 పరుగుల లోపే పంజాబ్ ఆల్ అవుట్ అయింది

124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది మొదటి 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది, ప్రతి ఓవర్లో నూ పంజాబ్ ఒక వికెట్ తీసి కేకేఆర్ ఒత్తిడి పెంచింది గిల్(9), రానా(0), నరేన్(0) లు స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. ఈ దశలో కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ రాహుల్ త్రిపాఠితో కలిసి నాలుగో

వికెట్ కి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరిద్దరూ చక్కటి షాట్స్ తో పంజాబ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దీపక్ హూడా బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి(41) అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన రస్సెల్ (10)టచ్ లోనే ఉన్నా లేని పరుగు కోసం రనౌట్ అయ్యాడు. తర్వాత దినేష్ కార్తీక్(12) తో కలిసి మోర్గాన్(47) కేకేఆర్ ని విజయం వైపు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరూ కలిసి 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు


please share and follow me on social media .


Comments


bottom of page