top of page

వాట్సాప్ యూజర్లకు శుభవార్త


వాట్సాప్ వినియోగదారులకు నూతన ప్రైవసీ పాలసీ అంగీకరించకపోయినా, గడువు ముగిసినప్పటికీ వారి ఖాతాలను డిలీట్ చేయబోమని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇందుకోసం గడువు విధించిన మే 15 డెడ్ లైన్ విషయంలో వాట్సాప్ వెనక్కి తగ్గింది. అలాగే ప్రైవసీ పాలసీ అందించాలన్న రిమైండర్ లను మరి కొన్ని వారాల పాటు యూజర్లకు పంపిస్తామని వాట్స్అప్ ప్రతినిధి చెప్పారు. ఇప్పటి వరకు అలా సందేశాలు వచ్చిన వారిలో చాలామంది ప్రైవసీ పాలసీ ఆమోదించాలని తెలిపారు. అయితే ఎంతమంది ఆమోదించారు అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.


వాట్స్అప్ ప్రైవసీ పాలసీ ఏమిటి

ఏదైనా యాప్ కావాలంటే ప్రైవసీ ఎంతో కీలకం యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సదరు యాప్ నిర్వాహకులపై ఉంటుంది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భరోసా ఇస్తామని కేంద్రానికి వాట్సాప్ స్పష్టం చేసింది. కానీ దీనిపై చాలామందిలో అనుమానాలు వస్తూనే ఉన్నాయి.ఒకవేళ ప్రైవసీ పాలసీ కి సంబంధించి అంగీకరించకపోతే ఏమి జరుగుతుంది, అంగీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

వాట్సప్ తన యూజర్లకు ప్రైవసీ పాలసీ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. తమ భద్రతకు ప్రైవసీకి సమాచారం అందించడమే తమ లక్ష్యం అని చెప్పింది. కొంత మంది ఫేస్బుక్లో వాట్సప్ పంచ్ ఉంటుందని ఆందోళన చేశాయి చేశారు వాటన్నింటిని వాట్సప్ ఖండించింది ఫేస్బుక్ లో వాట్సాప్ పంచుకోవడం జరిగిందని వాట్సాప్ కూడా అంగీకరించింది. అంతేకాకుండా యూజర్ల ప్రైవసీని కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేసింది. ఎక్కువగా బిజినెస్ యూజర్ల కోసం కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చినట్లు వెల్లడిస్తుంది. వ్యక్తిగతంగా చేసుకునే మెసేజీలు, కాల్స్ కు సంబంధించిన వివరాలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సాంకేతిక వినియోగించడం తో, వాట్సాప్ చూడలేదని తెలిపింది.



మరి ఎందుకు దీనిపై వివాదం పెరిగింది

ఒకపక్క యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రత కు ఆటంకాలు వుండవని వాట్సాప్ చెబుతున్నా తమ సమాచారాన్ని ఐపి అడ్రస్ లను ఇతర సోర్సులకు ఇస్తున్నారని అంతర్జాతీయంగా ఆందోళనలు ఎక్కువ అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని భావించిన దానిని మీ 15వ తేదీకి వాయిదా వేసింది. డేటా షేరింగ్ కు సంబంధించింది ప్రతి ఒక్కరు వ్యతిరేకించే అంశం అయితే దీనిపై వాట్సాప్ స్పష్టమైన వివరణ ఇచ్చిన భద్రతకు సంబంధించి ఎవరి అనుమతి లేకుండా ఫేస్బుక్ షేర్ చేయమని వాట్సప్ తెలిపింది. కేవలం యూజర్ అనుమతి ఉంటేనే షేర్ చేసేందుకు, అదికూడా వాట్సప్ యూజర్ ఎంపిక మీదే ఆధారపడి ఉంటుందని తెలుపుతుంది.

కొత్త ప్రైవసీ పాలసీని ఫిబ్రవరి 8 నుంచి తీసుకురావాలని భావించిన యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని మే 15వ తేదీకి పెంచింది. ఒకవేళ అప్డేట్ ప్రైవసీ పాలసీ కి అనుమతి తెలిపేందుకు యూజర్ నిరాకరిస్తే, వాట్సప్ మొదట తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం ఇవ్వకపోతే యూజర్ వాట్సాప్ ఖాతాను వినియోగించే అవకాశం కోల్పోతారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత నేపథ్యంలో చాలామంది వాట్సాప్ ని వదిలేసి వేరే ఆప్ ని వాడాలి సూచించారు. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ ను వాడాలని అని సూచించారు ప్రస్తుతం వాట్సాప్ మే 15వ తేదీ డెడ్ లైన్ ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. ఒకవేళ యూజర్ కొత్త ప్రైవసీ పాలసీ కి సంబంధించి తన అంగీకారం తెలుపక పోయినా వాట్సాప్ సేవలను వినియోగించుకోవచ్చని వాట్సాప్ స్పష్టం చేసింది.



Comments


bottom of page