సోషల్ నెట్ వర్క్ యాప్ లు ఏమైనా, ఇంకా మొబైల్ యాప్స్ లోనైనా వినియోగదారులు వారి వ్యక్తిగత సమాచారం యొక్క భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీని కోసం యాప్ లు అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ అనేక చర్యలు తీసుకుంటుంది. దీని కోసం వాట్సాప్ అనేక ఫీచర్స్, అప్డేట్ తీసుకువచ్చింది. ఇవన్నీ ఎనేబుల్ చేసుకొని మన చాట్ ని భద్రంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1. గ్రూప్ సెట్టింగ్స్
ప్రస్తుతం వాట్సాప్ లో గ్రూపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఆఫీస్ , బిజినెస్ వేటికైనా గ్రూపులు ఉన్నాయి. అందులో మనకు తెలిసిన వారు కొంతమంది ఉంటారు. చాలా మంది మనకు తెలియని వారు కూడా ఉంటారు వారి నుంచి రక్షించేందుకు గ్రూప్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాలి దీని కోసం ఈ విధంగా సెట్ చేసుకోండి
వాట్సాప్> సెట్టింగ్స్> అకౌంట్ >ప్రైవసీ> గ్రూప్> వారిలో ఎవరికి మీ వివరాలు తెలియాలి అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసుకోండి.
2. టు స్టెప్ వెరిఫికేషన్
దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇతరులు ఎవరైనా మన వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఒక పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. వాట్సప్ కు ఇమెయిల్ లింక్ చేసి ఉంటే దానికి ఒక లింక్ వస్తుంది. లేదా నేరుగా ఏదైనా ఒక పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు.
వాట్సాప్> వాట్సాప్ సెట్టింగ్ > అకౌంట్> టు స్టెప్ వెరిఫికేషన్> ఎనేబుల్> సిక్స్ డిజిట్ పిన్ వెరిఫికేషన్ ఎంటర్ చేయాలి
3. టచ్ ఐడి/ ఫేస్ ఐడి
మన ఫోన్ కి వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లేదా పేస్ ఐడి పెట్టడం ద్వారా అదనపు భద్రతను అందించవచ్చు. ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకుంటే యాప్ నుంచి బయటకు రాగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది దాని కోసం
వాట్సాప్ >సెట్టింగ్స్> అకౌంట్> ప్రైవసీ >స్క్రీన్ లాక్
4. బ్లాక్ / రిపోర్ట్ స్పామ్
ఏదైనా అనుమానాస్పదమైన నంబర్ లేదా వ్యక్తులు , ఇబ్బంది కలిగించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండేందుకు బ్లాక్ చేయడం లేదా స్పామ్ రిపోర్ట్ చేయాలి. వారి నుంచి మీ ప్రొఫైల్ ఫోటోను లాస్ట్ సీన్ కాంటాక్ట్ వివరాలు వంటి వాటిని రక్షిస్తుంది
5. డిసప్పీరింగ్ మెసేజ్
వాట్సాప్ డిసప్పీరింగ్ మెసేజ్ ఫీచర్స్ గత ఏడాది నవంబర్ లో తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత చాట్ లో ఉన్న మెసేజీలు వారం రోజుల తర్వాత మాయమైపోతాయి. తాజాగా 24 గంటల్లో మెసేజ్లు డిలీట్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. టీచర్ ని సెట్ చేసుకోవాలంటే వాట్సాప్ లో ఒక కాంటాక్ట్ ఎంచుకోవాలి అక్కడ ఉండే మూడు చుక్కల పై క్లిక్ చేయాలి న్యూ కాంటాక్ట్ లో మెసేజ్ ఆన్ చేయాలి
This feature can make your WhatsApp chats safe. Thank you
Comments