How to keep Password safe
మనందరం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నాం, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ఇలా సోషల్ మీడియా కైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్కైనా పాస్వర్డ్ ఎంతో ముఖ్యం ఒక్కో దానికి ఒక్కో పాస్వర్డ్ పెట్టుకోవడం అనేది కొంచెం కష్టం, అన్నిటికీ ఒకే పాస్వర్డ్ పెట్టుకున్నా ఇబ్బంది, ఒక్కో దానికి ఒక్కో పాస్వర్డ్ పెట్టుకొని అన్ని గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అన్నిటికీ ఒకే పాస్వర్డ్ పెట్టుకుంటే హకెర్స్కి మన పాస్వర్డ్ ఈజీగా తెలుస్తుంది. ఒక్కటి తెలిస్తే చాలు మిగిలిన అన్ని అతని చేతిలోకి వెళ్లిపోతాయని. మరి దీన్ని అధిగమించడానికి కోసం గూగుల్ క్రోమ్ వాడేవారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
పాస్వర్డ్ మేనేజర్
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు పాస్వర్డ్ మేనేజర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని 4 లెవల్స్లో అప్గ్రేడ్ చేస్తోంది. ఇతర పాస్వర్డ్ మేనేజర్ నుంచి పాస్వర్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్ సెక్యూరిటీ పరిధిలోకి తీసుకు రావచ్చు. వెబ్ సైట్ లో వీటిని వాడుకోవచ్చు. అలాగే క్రోమ్ పాస్వర్డ్ మేనేజర్ చేసే మరో ముఖ్యమైన పని వీక్ గా ఉన్న పాస్వర్డ్ ని గుర్తిస్తుంది. అలాగే వాటిని సరిచేస్తుంది కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్ లేదా పేరుని పాస్వర్డ్ గా తీసుకుంటారు ex Ravi@143 ఈ పాస్ వర్డ్ బలహీన పాస్వర్డ్ కాకపోయినా దీన్ని వివిధ వెబ్సైట్లకు వాడుతుంటే హకెర్స్ సులువుగా గుర్తిస్తారు. ఇది ఒక సారి హకెర్స్ చేతి లోకి వెళ్తే మీ మిగిలిన ఖాతాలను సులభంగా తెలుసుకుంటారు. ఇలాంటి ప్రమాదాలు పాస్వర్డ్ మేనేజర్ గుర్తిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి సహాయం చేస్తుంది
డూప్లెక్స్ సహాయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే డూప్లెక్స్ సైతం బలమైన పాస్వర్డ్లను అందిస్తుంది. రోబో గొంతుతో ఆన్లైన్లో టికెట్స్ కొనడం, విమానాల అందుబాటును తెలుసుకోవడం, ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వంటి వివిధ పనులకు డూప్లెక్స్ ఉపయోగపడుతుంది. ఇది గూగుల్ అసిస్టెంట్తో కలిసి బ్రౌజింగ్, స్క్రోలింగ్, క్లిప్పింగ్ ఫామ్స్ నింపడం వంటి పనులకు సహాయం చేస్తుంది. అంతే కాదు ఎప్పుడైనా వ్యక్తిగత వివరాలు చోరీకి గురైనట్లు గమనిస్తే బలమైన పాస్వర్డ్లను నిర్ణయించుకోవడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగ పడుతుంది.
డేటా సింక్
క్రోమ్ లో డేటా సింక్ చేయమంటే అన్ని పరికరాలలోనూ అదే సమాచారాన్ని చేసుకోవడానికి వీలుండడం, బుక్ మార్క్స్, హిస్టరీ ఓపెన్ చేసిన టాప్స్, పాస్వర్డ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, చిరునామాలు, ఫోన్ నెంబర్లు వంటివన్నీ సింక్ అవుతాయి. అయితే ఎలాంటి సమాచారాన్ని సింక్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం క్రోమ్ని ఓపెన్ చేసి అన్నింటికన్నా పైన కనిపిస్తున్న మూడు చుక్కల పైన క్లిక్ చేసి సెట్టింగ్ లోకి వెళ్లాలి, అందులో సింక్ అండ్ గూగుల్ విభాగంలో సింక్ అండ్ గూగుల్ సర్వీస్ నొక్కాలి, రివ్యూ యువర్ సింక్ డేటా ద్వారా ఏ అంశాలను సింక్ చేశామన్నది తెలుసుకోవచ్చు తిరిగి సింక్ అండ్ గూగుల్ సర్వీస్ లోకి వెళ్లి ‘మేనేజ్ వాటి యు సింక్’ క్లిక్ చేయాలి కావాలనుకుంటే సింక్ ఎవెరీతింగ్ ఎంచుకోవచ్చు. చేయొద్దని భావించే సేవలను టర్న్ ఆఫ్ చేయాలి. ఆటోమేటిక్ పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ ని అప్డేట్ అయ్యేంతవరకు పాస్వర్డ్లను మనమే మార్చుకోవాల్సి ఉంటుంది.పాస్వర్డ్ మేనేజర్ పలు ఖాతాల కోసం ఎప్పటికప్పుడు బలమైన విశిష్టమైన పాస్వర్డ్లను సృష్టించడానికి తోడ్పడుతుంది
గూగుల్ మిషన్
క్రోమ్లో సింక్ ను టర్న్ ఆన్ చేసుకుంటే ఏదైనా సైట్ లో కాతని తెచ్చేటప్పుడు బలమైన పాస్వర్డ్లను సృష్టించుకోవడం తేలికవుతుంది. పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ని క్లిక్ చేస్తే యూజ్ సజెస్ట్ పాస్వర్డ్ ప్రత్యక్షమవుతుంది ఇందులో గూగుల్ మిషన్ పాస్వర్డ్ సృష్టించి సిద్ధంగా ఉంచుతుంది. దీన్ని మళ్ళీ మనం వాడుకోవడానికి గూగుల్ దానంతట అదే సేవ్ చేసి పెట్టుకుంటుంది.
క్రోమ్ సెట్టింగ్స్ లోని సేఫ్టీ చెక్ ద్వారా బలమైన బలహీన పాస్వర్డ్ని గుర్తించొచ్చు సేఫ్టీ చెక్ లోకి వెళ్లి చెక్ నొక్కాలి. ఇది బలహీనమైన సాంకేతిక పదాలను గుర్తించి మార్చుకోవాలని సూచిస్తుంది
Comments