Windows 11 Features
హలో ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ కొత్తగా విండోస్11 ఓ ఎస్ రిలీజ్ చేస్తుంది. 2015 లో వచ్చిన windows 10 తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ కొత్త ఓఎస్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇంతకుముందు ఉన్న విండోస్ ఓఎస్తో కంపేర్ చేస్తే ఈ ఓఎస్ ని కొత్తగా డిజైన్ చేశారు ముఖ్యంగా ఆపిల్ మాక్ ఓఎస్ లాగా డిజైన్ చేశారు.
మైక్రోసాఫ్ట్ వారు రిలీజ్ చేసిన వీడియో ని చూస్తే ఈ ఓ ఎస్ అట్రాక్టివ్ గా, స్మూత్ గా, ఎక్కువ ఫీచర్స్ తో ఎక్కువ విడ్జెట్స్ తో మరింత ఆకట్టుకునేలా తయారు చేశారని మనకు అర్థమవుతుంది.
Windows 11 2021 చివర్లో విడుదల అవుతుంది. అలాగే విండోస్ టెన్ యూజర్స్ ఉచితంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు
ఈ లేటెస్ట్ windows 11 ఓఎస్ లో రాబోతున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ గురించి తెలుసుకుందాం
Android apps on windows
ఆండ్రాయిడ్ ఆప్ లను విండోస్కి తొలిసారిగా తీసుకొస్తుంది మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్స్ ని చూడొచ్చు అమెజాన్ అప్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఆధారిత ఆప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు విండోస్ లో టిక్ టాక్ జూమ్ అడోబ్ క్రియేట్ క్లౌడ్ అలాంటి ఆప్షన్ కూడా చూడొచ్చు.
Ultimate game experience
కొత్త windows 11 OS లో గేమ్స్ కోసం అనేక ముఖ్యమైన మార్పులని చేసింది. కొత్త ఓఎస్ లో ఆటో HDR ఫీచర్ ఉంటుంది. దీనివల్ల ఎక్స్ బాక్స్ లో గేమ్స్ ఆడే వారికి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వీటిలో అధిక ఫ్రేమ్ రేట్, ఎక్కువ గ్రాఫిక్స్ తో మనం హెచ్ డి ఆర్ లో గేమ్స్ ఆడుకోవచ్చు దీనివల్ల చూడటానికి చాలా ఎట్రాక్టివ్గా ఉంటుంది
Multitasking
కొత్త windows 10 OS లో మల్టీటాస్కింగ్ కోసం స్నాప్ లేవుట్, స్నాప్ గ్రూప్స్ ని తీసుకు వచ్చింది దీనికోసం డీఫాల్ట్గా ఆరు రకాలు లేవుట్స్ ఇస్తున్నారు. ఇది మీ విండోస్ నిర్వహించడానికి మరియు మీ స్క్రీన్ రియల్ ఎస్టేట్ ని ఆప్టిమైజ్ చేయడానికి మీకు సహాయపడుతుంది ఈ కొత్త ఫీచర్స్ మల్టీటాస్కింగ్ చేసేవారికి ఎంతో ఉపయోగపడుతుంది
Widget
విండోస్ సెవెన్ లో మీకు కొత్త విడ్జెట్స్ కనబడతాయి ఈ విడ్జెట్స్ వల్ల, డెస్కుటాప్ సైడ్ కి న్యూస్ వెదర్ రిపోర్ట్ క్యాలెండర్,రీసెంట్ ఫొటోస్ వంటివి చూపిస్తుంది.
మీరు మీ వర్క్ చేసుకునేటప్పుడు మీ వర్క్ కి అంతరాయం కలగకుండా వెదర్ రిపోర్ట్ తర్వాత న్యూస్ ని నోటిఫికేషన్ రూపంలో తీసుకు వచ్చింది. ఈ పాప్ అప్ మీరు ఓపెన్ చేసినప్పుడు అవి గ్లాస్ లగా మారి పోతాయి కాబట్టి మీరు చేసిన పనికి అంతరాయం కలిగించవు.
Windows 11 లో స్టార్ట్ మెనూ ఎడమవైపు నుంచి సెంటర్కి తీసుకు వచ్చారు అంటే స్క్రీన్ సెంటర్లో పాప్ అప్ అవుతుంది. ఇది మ్యాక్, chrome OS ఇలానే ఉంటుంది.
మరిన్ని
విండోస్ టెన్ లో స్మార్ట్ స్టార్ట్ మెనూ ఓపెన్ చేయగానే ఐకాన్స్ జిప్ తరహాలో ఆటో ప్లే అవుతుంటాయి. కొత్త OSలో లైఫ్స్టైల్ స్థానంలో రౌండేడ్ కార్నర్ తో అప్ ఐకాన్స్ తీసుకొచ్చారు.
ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్స్ తరహాలో కొత్త డాక్యుమెంట్ ఫీచర్స్ని తీసుకొస్తున్నారు సాఫ్ట్వేర్ తో పాటు సెర్చ్ లో డాక్యుమెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఉసెర్స్ కి ఉపయుక్తంగా ఉంటుంది
విండోస్ కంప్యూటర్ లో అప్డేట్ వచ్చిన ప్రతిసారి రీస్టార్ట్ అంటూ పెద్ద పని ఉంటుంది అవుతుంది. దీనివల్ల మన వర్క్ డిస్టబెన్స్ అవుతుంది. కానీ విండోస్ 11 లో అలాంటి సమస్యలు ఉండకుండా ఎక్కువశాతం అప్డేట్ బ్యాక్గ్రౌండ్ లోనే అయిపోయేలా తీసుకొస్తున్నారు.
విండోస్ 11 ని ఈ ఏడాది నవంబర్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు. విండోస్ టెన్ యూజర్స్ కి విండోస్ 11ని ఉచితంగా అప్డేట్ చేస్తారు. అయితే windows 10 జెన్యూన్ ఓఎస్ ఎస్ అయి ఉండాలి. కొత్త విండోస్ OS ని ఇన్స్టాల్ చేసుకునేవాళ్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Windows 11 OS ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవాలంటే మీ పీసీలో కొన్ని ఫీచర్స్ ఉండాలి. మీ సిస్టమ్ 64 బీట్ అయి ఉండాలి కనీసం 1GHz speed డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయి ఉండాలి. మీ పీసీలో కనీసం 4gb ram 64gb ఇంటర్నల్ మెమొరీ ఉండాలి
Comments