top of page

Best Budget DSLR Camera 2021 In India


DSLR కెమెరా కొందాం అనుకుంటున్నారా? ఐతే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి

Best Budget DSLR Camera 2021 In India


హలో ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ బడ్జెట్ DSLR కెమెరా గురించి తెలుసుకుందాం ఈ ఆర్టికల్ పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎవరైనా మంచి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా కొనుక్కోడానికి ఒక గైడెన్స్ మాత్రమే. జనరల్గా DSLR కెమెరా అంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందేమో అని మనం అనుకుంటాం. కానీ మనకు అందుబాటులో ఉన్న బడ్జెట్ లో మంచి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఫోటోగ్రఫీ ఇష్టమైతే ఏదైనా మంచి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా కొందామనుకుంటే ఈ కెమెరాస్ ని ఒకసారి ట్రై చేయండి.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కెమెరాస్ మంచి బడ్జెట్ లో మంచి ఫోటోగ్రఫీని అందిస్తాయి. వీటిని ఉపయోగించి మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇంస్టాగ్రామ్ రీల్స్ గాని లేదా ఫోటోగ్రఫీ కానీ తీసుకోవచ్చు


1. Canon cameras 1067C001


ఈ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా లైట్ వెయిట్ తో వస్తుంది అలాగే చేతితో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది

ఈ కెమెరా తో పాటు 50 ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ కూడా వస్తుంది.

ఇది 20 మెగాఫిక్సల్ కెమెరా తోపాటు బిల్ట్ ఇన్ వైఫై కూడా ఉంది

దీనిలో 5 ఇంచెస్ Lcd డిస్ప్లే ఉంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది

ఈ కెమెరా ని ఉపయోగించి మీరు ఇమేజెస్ తో పాటు వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు దీనిలో ఆడియో రికార్డు కూడా ఉంది

తక్కువ బడ్జెట్ లో మంచి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా కావడానికి కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి ఛాయిస్


2. Canon EOS 1500D


ఈ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా APS-C CMOS సెన్సార్ తో 24.1 మెగాపిక్సల్ తో వస్తుంది

ఈ కెమెరా ని ఉపయోగించి మంచి స్పీడ్ తో అలాగే ఆటోఫోకస్ తో ఎక్స్లెంట్ ఫోటోగ్రఫీ అందిస్తుంది

అలాగే ఈ కెమెరాను ఉపయోగించి మా ఫుల్ హెచ్డీ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు

ఈ కెమెరా వైఫై NFCi మరియు బ్లూటూత్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. వీటి ద్వారా ఇమేజెస్ ని వెంటనే షేర్ చేసుకోవచ్చు

అలాగే దీన్ని స్మార్ట్ ఫోన్ కి ప్రింటర్ కి వైఫై కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో బిల్డ్ఇన్ మైక్రోఫోన్ కూడా ఉంది దీని ద్వారా డైరెక్ట్గా మీరు వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు

ఇంకా దీనిలో ఇన్బిల్డ్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ కూడా ఉంది


3. Nikon D3500




డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా APS-C CMOS సెన్సార్ తో 24.2 మెగా పిక్సల్ తో వస్తుంది

ఈ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా ని ఉపయోగించి ఫుల్ హెచ్డి వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు

ఇది వైఫై, NFC, బ్లూటూత్ అలాగే కనెక్ట్ చేసుకోవచ్చు వీడియోస్ ని ఇమేజెస్ ని షేర్ చేసుకోవచ్చు

దీనిలో13.2 జీబీ వరకూ ఇంటర్నల్ మెమరీ ఉంది

అలాగే 128 జీబీ వరకూ మెమొరీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు

దీనిలో త్రీ ఇంచెస్ ఎల్ఇడి డిస్ప్లే ఉంది

అలాగే ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది

ఇది లైట్ వెయిట్ తో వస్తుంది చేతితో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది.


4. Sony Alpha ILCEST00L


ఇక సోనీ నుంచి వచ్చిన బెస్ట్ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా సోనీ ఆల్ఫా ILCEST00L

ఇది BIONZ X ఇమేజ్ ప్రాసెసర్ తో పాటు ఖచ్చితమైన ఆటోఫోకస్ తో వస్తుంది

ఈ కెమెరాను ఉపయోగించి ఫుల్ హెచ్డీ వరకు వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనువల్ కంట్రోల్ చేసుకోవచ్చు. హై ఫ్రేమ్స్ తో వీడియోరికార్డ్ చేసుకోవచ్చు

ఇది బ్లూటూత్ వైఫై NFC కి సపోర్ట్ చేస్తుంది

అలాగే వన్ టచ్తో ఇమేజెస్ ని వీడియోస్ ని మొబైల్ ఫోన్స్ కానీ లాప్టాప్ కానీ షేర్ చేసుకోవచ్చు.

ఇది లైట్ వెయిట్ తో వస్తుంది. ఇమేజెస్ తీసుకోవడానికి కెమెరా ని చేతిలో పట్టుకోడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది

సోనీ కెమెరా క్వాలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సోనీ కంపెనీ అంటేనే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకు వస్తుంది అలాగే ఇది కూడా మంచి క్వాలిటీతో తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన బెస్ట్ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా

దీనిలో 3.5 inch display తో వస్తుంది ఈ డిస్ప్లే ని rotate చేసుకోవచ్చు అందువల్ల మనం ఈ కెమెరా తో సెల్ఫీ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి ఈ కెమెరా చాలా బాగా ఉపయోగపడుతుంది


5. Canon EOS 3000D


ఈ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా 18 మెగా పిక్సల్ APS-C size CMOS సెన్సార్ తో పాటు DIGIC 4+ ఇమేజ్ ప్రాసెసర్ తో వస్తుంది

ఈ కెమెరా వైఫై కి సపోర్ట్ చేస్తుంది

అలాగే ఫుల్ హెచ్ డి వీడియోస్ కూడా తీసుకోవచ్చు

దీనికి 2.7 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే మాత్రమే ఉంది

అలాగే ఇది 64జిబి ఇంటర్నల్ మెమొరీ తో వస్తుంది


コメント


bottom of page