top of page

కోల్కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘణ విజయం


కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది . కేకేఆర్ బ్యాటింగ్లో త్రిపాఠి(36) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొదటి నుంచి రాజస్థాన్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ బ్యాట్స్ మెన్ భారీ షాట్లు ఆడలేకపోయాడు కేకేఆర్ ఓపెనర్స్ శుబ్ మన్ గిల్ (11)నితీష్ లను రాజస్థాన్ బౌలర్స్ కట్టడి చేయడంతో పవర్ ప్లే లో కేవలం 25 పరుగులు వచ్చాయి అలాగే ఆరో ఓవర్లో గిల్ రనౌట్ కావడంతో కేకేఆర్ మొదటి వికెట్ కోల్పోయింది ఆ తర్వాత వచ్చిన త్రిపాఠి ధాటిగా ఆడటంతో



స్కోర్ బోర్డు పరిగెత్తింది కానీ 9 ఓవర్లో నితీష్ రానా (22)10 ఓవర్లో సునీల్ నరైన్(6) 11 ఓవర్లో కెప్టెన్ మోర్గాన్ (0) రనౌట్ అవుట్ అవ్వడం తో కేకేఆర్ ఇన్నింగ్స్ నెమ్మదించింది రాజస్థాన్ బౌలర్స్ ఒత్తిడి పెంచడంతో బౌండరీలు కొట్టలేకపోయారు. ఈ దశలో త్రిపాటి దినేష్ కార్తీక్ (25)పోరాడారు చివర్లో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో వీరిద్దరూ అవుట్ అయిపోయారు ఆ తర్వాత వచ్చిన రస్సెల్ (9) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు ఇక చివర్లో కమ్మిన్స్(10) ఒక సిక్స్ కొట్టి అవుట్ అయిపోయాడు దీంతో కేకేఆర్ 133 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది


ఇక 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ ఓపెనర్ బట్లర్(5) త్వరగా అవుటయ్యాడు. కానీ మరో ఓపెనర్ జైస్వాల్ దాటిగా ఆడాడు. 40 పరుగుల వద్ద జైస్వాల్ (22)అవుట్ అవడంతో శివం దుబే తో కలిసి కెప్టెన్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు వీరిద్దరూ వేగంగా పరుగులు తీస్తూ స్కోరును పెంచారు వీరిద్దరూ మూడో వికెట్ కి 44 పరుగులు జోడించారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శివం దూబే భారీ (22)షాట్ కి ప్రయత్నించి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వచ్చిన తేవాతియా(5) ఎక్కువ సేపు గ్రీస్ లో ఉండలేదు, ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో అవుటయ్యాడు .సాధించాల్సిన రన్ రేట్ అందుబాటులోనే ఉండడం తో సంజు శాంసన్(42) తన సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు . డేవిడ్ మిల్లర్ (24)తో కలిసి సంజు శాంసన్ భారీ షాట్లు ఆడకుండా కేవలం 1, 2 పరుగులు తీస్తూ రాజస్థాన్ ని గెలిపించారు


For more technology new Switch to English language in Menu


コメント


bottom of page