top of page

మీ స్మార్ట్ ఫోన్ తో ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోండి


Check blood oxygen level with help of Smartphone

కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత చాలామంది ఎదుర్కొంటున్న సమస్య బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం. నార్మల్ గా అందరూ pulse oximeter ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకుంటారు. కానీ ఇది అందరికీ అందుబాటులో లేదు. ఇప్పుడు దీని కోసం హాస్పిటల్ కి కావాల్సిన అవసరం లేదు అలా అని pulse oximeter కొనాల్సిన అవసరం కూడా లేదు. మీ ఫోన్ ద్వారా బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ ని తెలుసుకోవచ్చు. అలాగే హార్ట్ బీట్. BP, ఆక్సిజన్ లెవెల్స్ , రెస్పిరేటరీ రేట్ ఇలా అన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా వీటన్నింటిని స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకుంటాం. కోల్కతాకు చెందిన కౌన్ నౌ హెల్త్ కేర్ అనే స్టార్ట్ అప్ కంపెనీ ఒక కొత్త ఆప్ ని తయారు చేసింది. ఈ యాప్ పేరు ‘కేర్ ప్లిక్స్ వైటల్’. ఈ యాప్ ద్వారా కేవలం నలభై సెకన్లలోనే 96 శాతం ఖచ్చితమైన రిజల్ట్ తో మీ ఆక్సిజన్ లెవెల్స్ చూపిస్తుంది.


How It work

ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో ‘ఫోటో ప్లేతిస్కోగ్రాఫీ’ అనే టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది సాధారణంగా మనం ఉపయోగించే పల్స్ మీటర్లలో ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఉంటాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లోని ఫ్లాష్ లైట్ ద్వారా తెలుసుకోవచ్చు దీని కోసం మీరు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మన వేలి ని బ్యాక్ కెమెరా ముందు ఉంచి స్కాన్ బటన్ క్లిక్ చేయాలి, అంతే ఇది కేవలం నలభై సెకన్లలోనే ఫలితాన్ని చూపిస్తుంది కానీ ప్రస్తుతం యాప్ కేవలం ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు అతి త్వరలో ప్లే స్టోర్ లోకి అందుబాటులో కి రాబోతుంది



Comments


bottom of page