top of page

అదిరిపోయే ఫీచర్స్ తో ఆపిల్ ఐఫోన్ 13




త్వరలోనే ఆపిల్ 13 ఫోన్ రిలీజ్ కాబోతుంది రీసెంట్గా ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో త్వరలో తీసుకువచ్చే వచ్చే ఐఫోన్ లో వచ్చే రాబోయే ఫీచర్స్ని ప్రకటించింది. ఆపిల్ కొత్తగా తీసుకువచ్చే ios 15 ఐపాడ్ os 15 మ్యాక్ os మంటారే వాచ్ os గురించి ఈ సమావేశంలో వివరించింది అందులో కొన్ని ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

Privacy


ఐఫోన్ అంటే ప్రైవసీకి పెద్దపీట వేస్తుంది రాబోయే కొత్త అప్డేట్ లో కూడా ప్రైవసీకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది.

ఫోన్ లో ఉండే ఆప్స్ తమ గురించి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయో ios 15 ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంటుంది. ఫోటో ఆల్బమ్, కాంటాక్ట్ లిస్ట్, మైక్రోఫోన్, వంటివాటిపై యాప్స్ పైచేయి సాధిస్తే వెంటనే మనకి తెలియజేస్తుంది. ఇలా వివిధ కంపెనీల ప్రకటనల కోసం తమను ట్రాక్ చేయొచ్చో లేదో నిర్ణయించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే ఐ పి ని ట్రాక్ చేయకుండా యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ అడ్డుకుంటుంది. ఇది ట్రాకర్లకు ఐపి అడ్రస్ తెలియకుండా చేస్తుంది. అలాగే కొన్ని మెయిల్ సందేశాలు పిక్సెల్ పిక్చర్స్ ద్వారా మనల్ని ట్రాక్స్ చేస్తుంటాయి. మెయిల్ ఇకపై డిఫాల్ట్ గ ఐపి అడ్రస్ లేకుండా చేస్తుంది.


Face time



ఆపిల్ ఎప్పటికప్పుడు ఫేస్ టైం లో కొత్త మార్పులు చేస్తూనే ఉంది. వీడియో సమావేశంలో ఉన్నప్పుడు ఎవరైనా కాల్స్ చేస్తే వీడియో చాట్ చేయడం లింక్ షేర్ చేసుకోవడం వంటివి వీటిలో కొన్ని తీసుకు వచ్చింది. అలాగే ఆండ్రాయిడ్ విండోస్ వాడే వారికి సైతం ఈ లింక్ ని వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వీడియోలు మాటలు మరింత స్పష్టంగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతుంది. అలాగే ఫేసియల్ ఆడియో టీచర్స్ మూలంగా ఫేస్ టైం కాల్ తో పాల్గొన్నవారు మన గదిలో ఉన్నారేమో అనే భావన కలిగించే ఈ విధంగా తీసుకొస్తుంది. అంటే స్క్రీన్స్ కుడివైపు ఉన్న వ్యక్తి మాట్లాడుకుంటే కుడి వైపు స్పీకర్ నుంచి మాటలు వినిపిస్తాయి, వెనుక దృశ్యాలను మసక పరిచి మాట్లాడేవారు మాత్రమే కనిపించేలా చేసే సదుపాయం ఉంది.


Control all Devices

యూనివర్సిటీ కంట్రోల్ ఆప్ మరో అధునాతన పరిజ్ఞానం ఆపిల్ వినియోగదారులకి నచ్చిన మరో ముఖ్యమైన ఫీచర్ మ్యాక్ os మంటారే తాజా వెర్షన్ లో ఈ అప్డేట్ తీసుకువచ్చింది. ఈ అప్ తో ఒకే సమయంలో మ్యాక్బుక్, ఐపాడ్ వంటి ఇతర పరికరాలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకి ఐ ఫోన్ లో ఏదో వార్తలు చూస్తున్నాడు అనుకోండి కావాలంటే దీన్ని మ్యాక్బుక్ లోనూ చదువుకోవచ్చు లేదా ఐప్యాడ్ లోనూ ఐమాక్స్లో లింకును కాపీ చేసుకోవచ్చు యూనివర్సిటీ కంట్రోల్ ద్వారా ఓకే మౌస్ కీబోర్డ్ పరికరాలతో వివిధ పరికరాలను యాక్సెస్ చేసుకోవచ్చు ఒకరి నుంచి మరొకరికి వీడియోలు ఫోటోలు ల తో ఎక్కువ పని చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది



Air pods

ఆపిల్ ఎయిర్ పోర్ట్స్ ఫోన్లో ‘కన్వర్జేషన్ బూస్ట్’ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇది రద్దీ ప్రాంతాల్లోనూ అలాగే ఎక్కువ శబ్దాలను వచ్చే ఏరియా లో నోయిస్ తీవ్రతను తగ్గించి ఎదురుగా ఉన్న వారి మాటలు స్పష్టంగా వినబడేలా చేస్తుంది ఏర్పాటు ఏర్పాటు మర్చిపోతే ఎయిర్ పాడ్స్ బ్రో ఎయిర్ పాడ్స్ మ్యాచ్లను ఎక్కడ పెట్టామో మర్చిపోతే ఫైండ్ మై నెట్ వర్క్ ద్వారా ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చు


No need keys

మనం ఇంట్లో తాళం చెవులు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం తరచూ జరుగుతుంది. ఇకపై ఐ ఫోన్ వినియోగదారులకు ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ఇల్లు ఆఫీస్ వేటి తలుపులనైనా డిజిటల్ గ తెరిచేందుకు మార్గం సుగమం చేసింది. వచ్చే మూడు నెలల్లో వెయ్యికి పైగా హోటల్లో ఈ పరిజ్ఞానాన్ని ఆరంభించాలని హయత్ హోటల్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది కూడా.


Health care...


ఆరోగ్యం విషయంలో యాపిల్ వాచ్, హెల్త్ ఆప్ లు ప్రత్యేకతలు అందరికీ తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలని ఆపిల్ వాచ్ కాపాడిందని మనం వార్తల్లో విన్నం పేపర్ లో చూసాం. ఆపిల్ వాచ్ ధరించిన, హెల్త్ యాప్ తో కూడిన ఈ ఐఫోన్ పట్టుకున్న చాలు మన గుండె వేగం, నడక, పరుగు వంటి సమాచారమంతా సేకరిస్తుంది. అడుగులు వేస్తున్న తీరుని బట్టి ఆపిల్ హెల్త్ మనం స్థిరంగా నడుస్తున్నామా లేదా బ్యాలెన్స్ తప్పుతున్నామా అనేది గుర్తిస్తుంది. నడుస్తున్నప్పుడు స్థిరంగా ఉండడానికి చిట్కాలు కూడా చెబుతుంది. కింద పడి పోయే ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. కృత్రిమ కాలు అమర్చుకున్న వారికి, కాలికి లేదా పాదానికి సర్జరీ చేయించుకున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. assistive touch ఫీచర్ ద్వారా ఒంటిచేత్తో నే అంటే చేతి కదలికలతో నే ఆపిల్ వాచ్ ను ఆపరేట్ చేయవచ్చు. ఒక చేయి మాత్రమే కలవారికి చేయి సరిగ్గా కదిలించలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.


  • వాచ్ ఓఎస్ 8 లో మైండ్ ఫుల్ నెస్ కూడా తోడవుతుంది/ ఇది బ్రీత్ అప్ నకు కొనసాగింపు. కొత్త అనిమేషన్ చిత్రాలు ఇతర ఫీచర్లతో మానసిక ప్రశాంతతకు తోడ్పడేలా దీన్ని మెరుగుపరిచారు. తాజా ఫిట్నెస్ యాప్ అయితే తాయి చి , పైలెట్ వంటి వ్యాయామాలను నేర్పిస్తుంది.


Multitasking


ఒకే సమయంలో రకరకాల పనులు చేసుకోవడానికి వీలుగా ఐప్యాడ్ ఓఎస్ 15 కొత్త హంగులతో వస్తుంది. విడ్జెట్లు ఆకర్షణీయంగానే కాదు పెద్ద గాను దర్శనమిస్తాయి. తెరమీద అన్నిటికన్నా పైన మల్టీటాస్కింగ్ మెనూ కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ మీద యాప్స్ సృష్టించుకోవచ్చు. ఇతర యాప్స్ చూడాలనుకుంటే తెరను స్ప్లిట్ చేసుకోవచ్చు. హోమ్స్క్రీన్ యాక్సిస్ చేయాలనుకుంటే విండోసు తెరను ఒక పక్కకు జరుపుకోవచ్చు. దీంతో ఇతర యాప్స్ పని చేయడం తేలికవుతుంది. నోట్స్ ఆప్ లో ఎక్కువమంది భాగస్వాములు అయ్యేలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇతరులకు పంపించిన డాక్యుమెంట్లతో సహా ఉద్యోగులను తయారు చేయడానికి అవకాశం ఉంది


క్విక్ నోట్స్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది ఇది నోట్స్ తీసుకునే యాప్ లను ఇతర యాప్ ల మీద తేలియాడేలా చేస్తోంది. ఇతర యాప్స్ లను క్లోజ్ చేయకుండానే నోట్స్ రాసుకోవడానికి వీలు కల్పిస్తుంది. షిఫ్ట్ ప్లే గ్రౌండ్ అయితే ఆప్స్ తయారీ నేర్చుకోవడానికి రూపొందించడానికి ipad ios ఐఫోన్ యాప్ స్టోర్ లో ఆ యాప్స్లను సబ్మిట్ చేయడానికి వీలు కల్పిస్తుంది Mac లేకపోయినా ఆప్స్ నిసబ్మిట్ చేసుకోవచ్చు.


మరిన్ని ....

ఆన్ డివైన్ ఇంటెలిజెన్స్ సాయంతో నోటిఫికేషన్లను ప్రధాన క్రమంలో అమర్చుకోవచ్చు దీంతో అత్యవసరమైన నోటిఫికేషన్ అన్నిటికన్నా పైన కనిపిస్తుంది. సిరి ఇకపై ఎయిర్ పాడ్స్ లో నోటిఫికేషన్లను ప్రకటిస్తుంది.


ఫుల్ స్క్రీన్ మ్యాపులు పరిస్థితులకు అనుగుణంగా మారిపోయే లేఅవుట్ల తో వాతావరణ సమాచారం మరింత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది


ప్రస్తుతం ఐఫోన్లను వాడుతున్న వారు తాత్కాలికంగా డేటాను ఐ క్లౌడ్ లో భద్రపరుచుకోవచ్చు. దీంతో కొత్త ఐఫోన్ కి తేలికగా సమాచారాన్ని పంపవచ్చు సబ్స్క్రిప్షన్ లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు


ధారాళంగా మాట్లాడ లేనివారు క్లిక్, క్లబ్, యు, వంటి శబ్దాలతోను ఐఫోన్ వాడుకోవచ్చు ఇందుకోసం స్విచ్ కంట్రోల్ ద్వారా ఆడియో స్విచ్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది


పర్వతాల వంటివి మరింత స్పష్టంగా కనిపించేలా ఆపిల్ మ్యాప్స్లో ఇంటరాక్టివ్ 3డి గ్లోబ్ దర్శనమివ్వనుంది


Comments


bottom of page