top of page

మీ ఫోన్ లో వైరస్ ఉందనే విషయం ఎలా తెలుసుకోవాలి

Updated: Jun 10, 2021



How to know if your phone has a virus and How remove virus/ malware from your phone


అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ యూస్ చేయని వారు అసలు లేరు. స్మార్ట్ ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఒకప్పుడు కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ తోపాటు, వీడియో కాల్స్ మనీ ట్రాన్సాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఎన్నో పనులు ఉపయోగిస్తున్నాము. దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది సైబర్ మోసగాళ్లు పెరిగిపోయారు. వారు మనకు తెలియకుండానే మన ఫోన్ లోకి వైరస్ ను పంపిస్తున్నారు. యాప్ లేదా పేజీలను ఆక్సిస్ చేసినప్పుడు మన ఫోన్ లోకి వైరస్ లేదా మాల్వేర్ తో హ్యాకర్ దాడి చేస్తున్నారు మరి మన ఫోన్ లో వైరస్ ఉన్న విషయం ఎలా గుర్తించాలి, వైరస్/ మాల్ వేర్ బారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.


పాప్ - అప్ యాడ్


కొన్ని సార్లు ఫోన్ లో సోషల్ మీడియా లేదా ఇమెయిల్ మరియు ఇతర యాప్ ఉపయోగించినప్పుడు మీ ప్రమేయం లేకుండా ఫోన్ స్క్రీన్ మీద కొన్ని రకాల పాప్ - అప్ యాడ్స్ కనిపిస్తాయి. వీటిని యాడ్ వేర్ అంటారు. ఇలాంటి వాటిని గుర్తిస్తే మీ ఫోన్ లో వైరస్ ఉందని భావించాలి. అలాగే ఇదేనా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తరచుగా వాణిజ్య ప్రకటనలు కనిపిస్తే అ యాప్ ను తొలగించడం ఉత్తమం.


ఫోన్ బ్యాటరీ నీ పని తీరు తగ్గిపోవడం

ఒకసారి మీ ఫోన్ ఉన్నట్లుండి స్లో అవుతుంది. అంతేకాకుండా సడన్ గా స్విచ్ ఆఫ్ పోవడం తరచుగా వేడెక్కడం వంటివి జరుగుతాయి. ఇలా ఐతే మీ ఫోన్లో మాల్వేర్/ వైరస్ ఉన్నట్లు భావించాలి . ఇవి బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తూ మన ఫోన్లో ని సమాచారాన్ని హ్యాకర్స్ కి చేరవేస్తాయి. అలానే ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం మళ్లీ ఛార్జింగ్ చేయాల్సి రావడం ఫోన్ ఛార్జ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఈ సందర్భంలో కూడా వైరస్ ఉందని అనుమానించాలి.

పేమెంట్ కోసం డిమాండ్


ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఏదైనా యాప్ లేదా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీ ప్రమేయం లేకుండా వాటంతట అవే క్లోజ్ అవుతాయి. తిరిగి మీరు వాటిని ఉపయోగించాలంటే కొంత నగదు చెల్లించమని మెసేజ్ వస్తుంది దీన్నే రంసోమ్ వెర్ అంటారు.


గుర్తుతెలియని అప్లికేషన్



మన అవసరానికి తగ్గట్టు ఎన్నో రకాల అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానే కొన్ని అప్లికేషన్లు వాటంతట అవే డౌన్లోడ్ అవుతాయి. అలా ఏదైనా ఫోన్లో కనిపిస్తే వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. వాటిద్వారా వైరస్ /మాల్వేర్ మీ ఫోన్ లోకి వ్యాపించే ప్రమాదం ఉంది ఇలాంటి వాటిలో ఎక్కువ స్పై వెర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫోన్ పై నిరంతరం నిఘా పెడుతూ యూజర్ డేటాను హాకర్స్ కి చేరవేస్తాయి. వాటివల్ల ఫొటోస్ వీడియోస్ తో పాటు ఫోన్లలో ఉండే డేటాకు ప్రమాదం పొంచి ఉన్నట్లే , అలానే ఏదైనా ఆప్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. వెంటనే ఆయాప్ అన్ ఇన్స్టాల్ చేయండి. ఎక్కువశాతం హ్యాకర్ యాప్ ద్వారానే వైరస్ ని ఫోన్ లోకి పంపుతుంటారు.


మీ ఫోన్ లో వైరస్లను అడ్డుకోవడం ఎలా

మీ ఫోన్లో మాల్వేర్ వైరస్ ఉన్నట్లు అనుమానం వస్తే తప్పనిసరిగా యాంటీవైరస్ లేదా ఆంటీ మాల్వేర్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవి మీ ఫోన్ ని స్కాన్ చేసి ఏమైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్ ఉంటే గుర్తించి రిపోర్టు చూపిస్తుంది.




.

ఫోన్లో మాల్వేర్ తొలగించేందుకు ఉన్న మరో మార్గం ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఇలా చేయడం వల్ల ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన అన్ని ప్రోగ్రాం లు డిలీట్ అయిపోయాయి. సెట్టింగ్స్ మారిపోయి ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా మారిపోతుంది ఒకవేళ మీ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలనుకుంటే మీ ఫోన్ లోని కాంటాక్ట్స్ తో పాటు ఇతర డేటాను బ్యాక్అప్ చేసుకోవడం మర్చిపోకండి.

ఈ విధంగా మీ ఫోన్ ని వైరస్ ల నుండి కాపాడుకోండి మరింత సమాచారం కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి

thank you




Comments


bottom of page