top of page

అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్నా ఆండ్రాయిడ్ 12

Updated: May 7, 2021



ప్రతి సంవత్సరం ఆండ్రాయిడ్ ఫోన్ లోకి కొత్త ఫీచర్స్ ఆప్షన్స్ జోడిస్తూ కొత్త రిలీజ్ చేస్తుంటారు. గూగుల్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 వెర్షన్ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి డెవలపర్ల కోసం ఇప్పటికే 3 బీటా వెర్షన్ ను విడుదల చేశారు. వాటి ఆధారంగా ఆండ్రాయిడ్ 12 ఇలా ఉండొచ్చు అంటూ కొన్ని ఫీచర్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫీచర్లేంటో ఒకసారి చూద్దాం


స్ప్లిట్ స్క్రీన్

ఒకేసారి రెండు యాప్స్ మొబైల్ స్క్రీన్ మీద చూసుకునే విధంగా గతంలో ఆండ్రాయిడ్ స్ప్లిట్ స్క్రీన్ అనే ఫీచర్స్ ని తీసుకు వచ్చింది. ఏదైనా యాప్ వాడుతున్నప్పుడు రీసెంట్ బటన్ క్లిక్ చేసి స్క్రీన్ ఎంచుకుంటే స్క్రీన్ పై భాగంలో యాప్ వచ్చి చేరుతుంది. ఆ తర్వాత మీకు కావలసిన యాప్ ఎంచుకుంటే అది దాని కింద వచ్చి చేరుతుంది. అయితే కింద ఉన్న యాప్ స్క్రీన్ పై భాగంలో కి వెళ్ళాలి అంటే కుదరదు. కానీ ఈ కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ లో ఈ ఆప్షన్ ని ఇస్తున్నారు రెండు విడదీస్తూ మధ్యలో ఉండే గీత మీద డబుల్ ట్యాబ్ చేస్తే వాటి ప్లేసులు మారుతాయి.


విడ్జెట్స్ వెతికేలా

మొబైల్ లో చాలా యాప్స్ ఉంటాయి. వాటి మెనూ లిస్టులో వెతుక్కోవడం అన్ని సమయాల్లో సులభం కాదు. అందుకే ఆప్స్ విడ్జెట్ తయారు చేస్తుంటాయి. అంటే షార్ట్ కట్ అన్నమాట. ఆండ్రాయిడ్ లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. అందులో మనకు కావాల్సిన యాప్ కు సంబంధించిన విడ్జెట్ వెతుక్కోవడం కష్టమే. అందుకే విద్యుత్ సెక్షన్ లో సెర్చ్ ఆప్షన్ ఇస్తున్నారు. మీకు కావలసిన పేరు టైప్ చేసి విడ్జెట్ ని సులభంగా వెతుక్కోవచ్చు. అయితే ఆ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉండాలి


గూగుల్ అసిస్టెంట్ కోసం

స్మార్ట్ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ యాక్టివ్ చేయడానికి కొత్త ఆప్షన్ రాబోతుంది చాలా ఫోన్ లో ok google హే google అంటే అసిస్టెంట్ ఆక్టివ్ అవుతుంది. పిక్సెల్ ఫోన్ లో అయితే ఫోన్ షేక్ చేయడం, బ్యాక్ టాప్ చేయడం, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా పవర్ బటన్ ఆప్షన్ ని యాడ్ చేస్తున్నారు. పవర్ బటన్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అవుతుంది. అయితే ఎంత సేపు లాంగ్ ప్రెస్ చేయాలనేది తెలియదు. ఎందుకంటే ఎక్కువ సేపు లాంగ్ ప్రెస్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది.


స్క్రీన్ షాట్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోవడం చాలా సులభం. కానీ ఆ స్క్రీన్ షాట్ ని ఎక్స్పాండ్ చేయడం కుదరదు. ఏదైనా వార్త మొత్తం స్క్రీన్ షాట్ తీసుకుందాం అంటే కుదరదు. బిట్స్ బిట్స్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఓ ఎస్ లో ఈ ఆప్షన్ ఉండబోతుంది. స్క్రీన్ షాట్ కొట్టి దిగువ క్యాప్చర్ మోర్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.

ఎక్స్ ఎక్స్పాండ్ బటన్ నొక్కితే ఎంతవరకు కావాలంటే అంతవరకు స్క్రీన్ షాట్ ఎక్స్పాండ్ అవుతుంది


ఇంకా కొన్ని కొత్తగా

సెక్షన్ ల లోడింగ్, ఆప్ డ్రాయర్ ఓపెన్, యాప్ ఓపెన్ అయ్యే విధానం లో ఎఫెక్ట్ ని మారుస్తున్నారు ఈ ప్రక్రియలో గతంలో కంటే వేగంగా సులభంగా ఉంటాయి.


డివైస్ కంట్రోల్ ప్యానెల్ లో కూడా మార్పులు చేస్తున్నారు. బ్రైట్నెస్ స్లైడ్ ను, వాల్యూమ్ అడ్జస్ట్ స్లైడర్ ను మార్చేశారు, దీంతోపాటు సెట్టింగ్స్ టైల్స్ లో మార్పులు ఉంటాయి


లొకేషన్ షేర్ చేసినప్పుడు కొత్త ఆండ్రాయిడ్ లో ఫ్రీ సైజ్ అప్ప్రోక్సిమాట్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అప్ప్రోక్సిమాట్ ఏమిటంటే మీరు ఉన్న ప్రాంతం సుమారుగా అవతల వ్యక్తికి తెలుస్తుంది.ఫ్రీ సైజ్ అంటే కచ్చితమైన సమాచారం అందుతుంది


వైఫై ఇంటర్నెట్ విభాగంలో మార్పులు చేస్తున్నారు ఇకపై వైఫై కనెక్షన్ ను ఇంటర్నెట్ అని పిలుస్తారు. వైఫై నెట్వర్క్ లో వైఫై 5 , వైఫై 6 అని రెండు టైప్స్ తీసుకొస్తున్నారు దీంతోపాటు ఎక్స్టెండెడ్ కంపాటిబిలిటీ ఆప్షన్ కూడా వస్తుంది వైఫై hotspot ఎక్కువగా ఉపయోగించే వారికి ఉపయోగం ఉంటుంది.


కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ లో సరికొత్త ఎమోజీ లను తీసుకొస్తున్నారు. ఎమోజి 13.1 ప్యాక్ ను ఇందులో పొందుపరుస్తున్నారు. గతంలో ఉన్న ఇమేజ్ కు భిన్నంగా ఉంటాయి.


ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 రివ్యూ దశలో ఉంది. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం మొదలైంది. బీటా వెర్షన్ టెస్ట్ వరకు జూలై ఆఖరి వరకు ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే బగ్స్ ని సరి చేసి ఆగస్టు తర్వాత అందరికీ కొత్త ఆండ్రాయిడ్ అందుబాటులోకి తెస్తారు. ఏ మొబైల్ కి ఎప్పుడు వస్తుందనేది రిలీజ్ సమయంలో ఆండ్రాయిడ్ ప్రకటిస్తుంది




Comments


bottom of page