top of page

హైదరాబాద్ కి మరో ఓటమి


సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది.. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీ చేసి భారీ స్కోర్ కి తోడ్పడ్డాడు అతనికి కెప్టెన్ సంజు శాంసన్(48) సహకరించాడు. మరో ఓపెనర్ జైస్వాల్(17) త్వరగానే అవుట్ అయినా , బట్లర్, సంజు శాంసన్ లు ఇద్దరు ధాటిగా ఆడి సన్రైజర్స్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా బట్లర్

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు సాధించాడు చివరిలో బట్లర్ అవుట్ అయినాడేవిడ్ మిల్లర్, పరాగ్ దాటి ఆడి స్కోర్ ని 220 కి చేర్చారు

220 పరుగుల భారీ లక్ష్యంతో బావి లోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ లో మనీష్ పాండే(31) బెయిర్ స్టో (30)లు ఓపెనింగ్ కి దిగారు. వీరిద్దరు మొదటి వికెట్ కి ఆరు ఓవర్లలో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ అయిపోయిన మిగతా బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. విలియంసన్(20) బౌండరీలు బాధ కుండా కేవలం సింగిల్ కి పరిమితమయ్యాడు. ఇక విజయ శంకర్(8) ఎప్పుడు అవుట్ అయిపోదామా అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. కేదార్ జాదవ్(19), సమద్(10), నబి(17) ఒకటి, రెండు షాట్లు ఆడిన త్వరగా అవుట్ అయిపోయి జట్టు ఓటమి బాట పట్టించారు. ఇక ఈ మ్యాచ్ లో వార్నర్ స్థానంలో నబిని తీసుకొని యజమాన్యం అభిమానులకు షాక్ ఇచ్చింది. నబి.ఒక ఓవర్ వేసి 21 పరుగులు ఇచ్చాడు.వార్నర్ లేని సన్రైజర్స్ జీర్ణించుకోలేని అభిమానులు సన్ రైజర్స్ కి సపోర్ట్ చేయడం మానేశారు. ట్విట్టర్ లో నో వార్నర్ నో సపోర్ట్(NowarnerNoSupport) అనే యాష్ ట్యాగ్ (#) ట్రేండింగ్లో ఉంది.


Comments


bottom of page