top of page

సన్రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

Updated: May 2, 2021



సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో, సన్రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. మనీష్ పాండే (61)టాప్ స్కోరర్ సన్రైజర్స్ ఓపెనర్ బెయిర్స్టో (7) పరుగులు చేసి త్వరగా అవుట్ అయినా, మనీష్ పాండే, వార్నర్ రెండో వికెట్ కి 106 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వార్నర్ తన సహజ


శైలిలో భారీ షాట్లతో కాకుండా నెమ్మదిగా ఆడాడు. ఓవైపు మనీష్ పాండే పర్వాలేదనిపించాడు. భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో వార్నర్, మనీష్ పాండే లుంగీ ఎంగిడీ బౌలింగ్ లో ఓకే ఓవర్లో అవుటయ్యారు చివర్లో కేన్ విలియమ్సన్(26) భారీ షాట్లు కొట్టడం తో 172 పరుగులు చేసింది విలియంసన్ 19వ ఓవర్లో మూడు ఫోన్లు కొట్టి ఫోర్స్


సిక్స్ కొట్టి ఆ ఓవర్లో 20 పరుగులు పిండుతున్నాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో లాస్ట్ రెండు బంతుల్ని 4, 6 కొట్టి కేదార్ జాదవ్ (12) ఇన్నింగ్స్ ని ముగించాడు

ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ ఋత్ రాజ్ గైక్వాడ్(75), డుప్లెసిస్(56) శుభారంభం ఇచ్చారు వీరిద్దరూ మొదటి వికెట్ కి 129 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో డుప్లెసిస్ ,గైక్వాడ్ అర్థ సెంచరీలు పూర్తి చేశారు వీరిద్దరిని రషీద్ ఖాన్ విడదీశాడు. రషీద్ ఖాన్ డుప్లెసిస్ ,గైక్వాడ్ మొయిన్ అలీ(15)ని అవుట్ చేసిన, అప్పటికి మ్యాచ్ పూర్తిగా చెన్నై వైపు వెళ్ళింది. త్వరత్వరగా వికెట్లు పడ్డా జడేజా(7) రైనా(17) మ్యాచ్ ముగించారు


Comentarios


bottom of page