top of page

రాజస్థాన్ రాయల్స్ ఫై ముంబై ఇండియన్స్ ఘన విజయం

Updated: May 2, 2021



ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఫై గెలిచింది. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ రాజస్థాన్ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. రాజస్థాన్ ఓపెనర్స్ జోస్ బట్లర్,i జైపాల్ రాజస్థాన్ కి శుభారంభం చేశారు. వీరిద్దరూ మొదటి వికేట్కి 66 పరుగులు జోడించారు రాహుల్ చాహర్ వీరిద్దరిని తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. జైపాల్ అవుట్ అయ్యే సమయానికి రాజస్థాన్ 10 ఓవర్లలో 91 పరుగులు చేసింది ఆ జట్టు కచ్చితంగా మిగతా 10 ఓవర్లలో కొండపైన మరో వంద పరుగులు చేస్తుంది అనిపించింది కానీ ముంబై బౌలర్స్ చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగులు ఇవ్వలేదు కెప్టెన్ సంజూ శాంసన్, శివమ్ దూబే ధాటిగా ఆడి ప్రయత్నంలో అవుట్ అయిపోయారు. చివరి ఓవర్లలో మిగతా బ్యాట్స్మెన్ భారీ షాట్లు ఆడకపోవడంతో రాజస్థాన్ 171 పరుగులు మాత్రమే చేయగలిగింది.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ ముంబై ఇండియన్స్ మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది ముంబై ఓపెనర్స్ డికాక్ రోహిత్ శర్మ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ 49 పరుగులు జోడించారు రోహిత్ శర్మ క్రిస్ మోరిస్ బౌలింగ్లో అవుటయ్యాడు సూర్య కుమార్ కూడా పదవ ఓవర్లో క్రిస్ మోరిస్ బౌలింగులో అవుట్ కావడంతో రెండో వికెట్ కోల్పోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కృనాల్ పాండ్యా డికాక్ ధాటిగా ఆడటంతో లక్ష్యం తరుగుతూ పోయింది వీరిద్దరూ మూడో వికెట్ కి 59 పరుగులు జోడించారు 17 ఓవర్లలో ముస్తాఫిజుర్ బౌలింగులో పాండ్యా అవుటయ్యాడు అప్పటికి విజయం ముంబై వైపు వెళ్ళింది. మిగతా పనిని పోలార్డ్ తో కలిసి డికాక్ పూర్తిచేశాడు. డికాక్ 70 పరుగులు చేసి నాట్ అవుట్గ నిలిచాడు




Comments


bottom of page