top of page

బడ్జెట్ లో వివో IQOO 5G మొబైల్



వివో సబ్ బ్రాండ్ Iqoo తన Iqoo సిరీస్ లో కొత్త IQOO Z5 5g ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. వివోలో మంచి 5G మొబైల్, మంచి కెమెరాతో కావాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఛాయిస్

కొత్త IQOO Z5 5g qualcomm snapdragon 7785G ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ 6nn టెక్నాలజీ తో వస్తుంది. అలాగే ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ ఫోన్ తో మీరు హెవీ గేమ్స్ మీడియం గ్రాఫిక్స్ లో చక్కగా ఆడుకోవచ్చు.ఇది LPDDR5 రామ్ తో UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది.


ఈ ఫోన్ సిక్స్ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్ డి IPS LCD డిస్ప్లేతో వస్తుంది.డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్5 తో ప్రొటెక్ట్ చేసారు. 240hz టచ్ సాంపిల్ రేట్ తో వస్తుంది.



అలాగే triple camera సెట్ అప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 64 megapixel,దీనిలో సూపర్ నైట్ మోడ్, ఇంకా డ్యూయల్ వీడియో వ్యూ కూడా ఉంది. అలాగే 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఈ కెమెరా తో 123 డిగ్రీ వైడ్ లో ఫొటోస్ తీసుకోవచ్చు, 2 మెగా పిక్సల్ మైక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. సింగల్ టేక్ ఫీచర్ కూడా వుంది

ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది.

ఈ ఫోన్ లో 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 44 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు. కేవలం 23 మినిట్స్ లో50% ఛార్జ్ అవుతుంది. దీనిలో 28837 mm2లిక్విడ్ కూలింగ్ సిస్టం ఉంది ఇది 3 డిగ్రీ వరకు సర్ఫేస్ ని 12 డిగ్రీ వరకు CPUని కూల్ గ ఉంచుతుంది. దీనిలో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి దీంతో 3D సౌండ్ ని ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ వైబ్రెంట్ మోటార్ కూడా ఉంది గేమ్ ఆడే టప్పుడు మంచి వైబ్రేషన్ వస్తాయి

. .

ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5MM ఆడియో పోర్ట్ కూడా ఉంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు డాల్బీ సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.

ఇక ఈ ఫోన్ లో మూడు వేరియెంట్స్ ఉన్నాయి. 8gb ram 128 ఇంటర్నల్ మెమరీ, అలాగే 8gb ram 256 ఇంటర్నల్ మెమరీ. అలాగే 12gb ram 256 ఇంటర్నల్ మెమరీ


బేస్ వేరియెంట్స్ 8gb 128 price 22,490

ఈ ఫోన్ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో సేల్ కి తీసుకువస్తున్నారు

ఈ ఫోన్ ఫై 1500కూపన్ ఉంది, అలాగే HDFCకార్డుఫై1500 డిస్కౌంట్ కూడా వుంది



Comentarios


bottom of page