top of page

పృధ్వి షా మెరుపు ఇన్నింగ్స్ కేకేఆర్ పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం

Updated: May 2, 2021



ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్కత నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కేకేఆర్ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌, ఆండ్రూ రస్సెల్ ధాటిగా ఆడాడు,మిగతా బ్యాట్స్మెన్ పరుగులు చేయకపోవడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ నితీష్ రానా(15) విఫలమైన శుభ్‌మన్‌గిల్‌(43), త్రిపాఠి(19) రెండో వికెట్కు 44 పరుగులు జోడించారు. త్రిపాఠి ని స్తోయినిస్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ మోర్గాన్(0) సునీల్ నరైన్(0) ఒకే ఓవర్లో ఆవిష్ ఖాన్ బౌలింగ్లో అవుటయ్యారు. ఆ తర్వాత గిల్‌, దినేష్ కార్తీక్(14) కూడా త్వరగానే అవుటయ్యారు. చివర్లో రస్సెల్(45).కమ్మిన్స్(11) దాటి గాడి కోల్కతా స్కోర్ 150 పరుగులు సాధించాడు.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ పృధ్వి షా , శిఖర్ ధావన్ లు ధాటిగా ఆడి ఢిల్లీకి శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా పృథ్వీ షా కేకేఆర్ బౌలర్లపై వీరబాదుడు బాదాడు. తొలి ఓవర్లోనే ప్రసాద్ కృష్ణ బౌలింగ్లో ఆరు బంతులను బౌండరీ దాటించాడు దీంతో తొలి ఓవర్లోనే ఢిల్లీ 25 పరుగులు చేసింది. ఇక ఐదు ఓవర్లలోనే


66 పరుగులు చేసి విజయానికి బాటలు వేసింది. ఈ క్రమంలో పృధ్వి షా 18 బంతులలో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.. ఓపెనర్స్ ఇద్దరు తొలి వికెట్కు 136 పరుగులు జోడించారు విజయానికి 22 పరుగుల దూరంలో ఉన్నప్పుడు శిఖర్ ధావన్(46) కమ్మిన్స్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు అవుటయ్యాడు మ్యాచ్ను తొందరగా ముగించాలనే ఉద్దేశంతో పృధ్వి షా(82), రిషబ్ పంత్(16) భారీ షాట్ కి ప్రయత్నించి కమ్మిన్స్ బౌలింగ్లో ఔట్ అయిపోయారు. 16వ ఓవర్లో ఫోర్ కొట్టిన స్తోయినిస్(6) ఢిల్లీని గెలిపించాడు


Comentários


bottom of page