top of page

పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం


ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ (99)వాల్ టాప్ స్కోర్. ఈ మ్యాచ్లో రాహుల్ కడుపునొప్పితో మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో రాహుల్ స్థానంలో ప్రభు సిమ్రాన్ సింగ్ మయాంక్ తో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్, క్రిస్ గేల్ త్వరగా అవుట్ ఐన మయాంక్ పంజాబ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. కానీ 14 ఓవర్ వరకు పంజాబ్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది డేవిడ్ మలన్ మయాంక్ సింగిల్స్ తోనే సరిపెట్టారు. 14వ ఓవర్లో డేవిడ్ మలన్ అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 88 పరుగులు మాత్రమే, కెప్టెన్ మయాంక్ గేరు మార్చి ధాటిగా ఆడటంతో పంజాబ్ చివరి ఆరు ఓవర్లలో 76

పరుగులు చేసింది మయాంక్ 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

167 పరుగుల లక్ష్యంతో కి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ పృథ్వీషా శిఖర్ ధావన్ లు శుభారంభం చేశారు. పవర్ ప్లే లో ఢిల్లీ 63 పరుగులు చేసి బలమైన పునాది వేసింది. కానీ ఆ వెంటనే పృద్వి షా అవుటయ్యాడు షా అవుటైన శిఖర్ ధావన్ స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించాడు. చక్కని షార్ట్ తో బౌలెర్స్ ఫై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఖర్ ధావన్ స్మిత్ తో కలిసి 48 పరుగులు జోడించారు స్మిత్ అవుటైన పంత్ తో కలిసి పంజాబ్ బౌలెర్స్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారీ షాట్లు ఆడి లక్ష్యాన్ని చెరువలో తీసుకొచ్చారు. అవుటైన హిట్మేయర్ తో కలిసి మరో 14 బంతులు ఉండగానే మిగతా పని పూర్తి చేశాడు. ఈ విజయం తో ఢిల్లీ మొదటి

స్థానంలో కి వెళ్లి ప్లే ఆఫ్ చేరువైంది .


Comments


bottom of page