top of page

చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఆర్ సి బి గెలిచింది

Updated: May 2, 2021



రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫై ఒక పరుగు తేడాతో గెలిచింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి ఆర్ సి బి పైచేయి సాధించింది. చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్ ఆర్ సి బి ని గెలిపించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న పంత్ జట్టును గెలిపించాడు లేకపోయాడు.

ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది ఆర్ సి బి ఓపెనర్లు దేవ్ దత్ పడిక్కాల్, విరాట్ కోహ్లీ మొదటి వికెట్ కు 30 పరుగులు జోడించారు వీరిద్దరూ రెండు వరుస బంతుల్లో ఆవిష్ ఖాన్, ఇషాంత్ శర్మ బౌలింగ్లో అవుటయ్యారు. ఆ తర్వాత మాక్స్వెల్, రజత్ వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేశారు. మాక్స్వెల్ భారీ షాట్ కి ప్రయత్నించి అమిత్ మిశ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన ఏబి డి విల్లర్స్ రజత్ తో కలిసి ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించారు. చివరి వరకు బ్యాటింగ్ సాగించిన డి విల్లర్స్ ఢిల్లీ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. స్టోయిన్స్


వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడు. మొత్తం మీద ఆ ఓవర్లో 23 పరుగులు పెడుతున్నాడు దీంతో ఆర్ సి బి 171 పరుగులు చేసింది

172 పరుగుల భాగస్వామ్యం లక్ష్యం తో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ప్రిద్వీ షా, శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు jజేమిసన్ ఇద్దరినీ విడదీశాడు. ఆ తర్వాత ఓవర్లో స్టీవ్ స్మిత్ సిరాజ్ బౌలింగ్లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఢిల్లీలో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీషా తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్నాడు పృథ్వీషా అవుటైన స్టోయిన్స్ తో కలిసి నాలుగో వికెట్ కి 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో స్టోయిన్స్ అవుటైన హిట్మేయర్


తో కలిసి ఢిల్లీ విజయానికి చివరి వరకు పోరాడారు.ఈ దశలో 17వ ఓవర్ వేసిన జేమిసన్ బౌలింగ్ లో హిట్మేయర్ 3 సిక్స్ లు కొట్టి మ్యాచ్ ఢిల్లీ వైపు తిప్పాడు. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమైన దశలో మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో మొదటి నాలుగు బంతుల్లో కేవలం మూడు పురుగులు వచ్చాయి చివరి రెండు బంతుల్ని ఫోర్లు కొట్టిన, చివరి బంతి సిక్స్ కొట్టాల్సిన దశలో ఫోర్ వెళ్ళింది దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడింది


Comments


bottom of page