top of page

ఉత్కంఠ భరిత పోరులో చెన్నై పై ముంబై విజయం దంచికొట్టిన పొలార్డ్


ది మ్యాచ్ అంటే, దీని కోసమే కదా ఐపిఎల్ చూసేది, ఇద్దరు సమ ఉజ్జీల మధ్య పోరు ఎలా ఉంటుందో ఈ మ్యాచ్లో నిరూపించారు.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చెన్నై పై గెలిచింది. చెన్నై పై సునామి లా విరుచుకు పడ్డ పొలార్డ్ వీర బాదుడుతో మ్యాచ్ గెలిపించాడు.


మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు సాధించింది చెన్నై ఓపెనర్ ఋత్ రాజ్ గైక్వాడ్(4) తొలి ఓవర్లోనే అవుటైన, మరో ఓపెనర్ డుప్లెసిస్(50) తో కలిసి మోయిన్ అలీ(58) ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కళ్ళు చెదిరే షాట్లతో అలరించారు. వీరిద్దరూ మూడో వికెట్ కి 108 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మోయిన్ అలీని బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో పొలార్డ్ వరుస బంతుల్లో డుప్లెసిస్. రైనా(2) లను ఔట్ చేసి ముంబాయి నీ పోటీలోకి తెచ్చాడు. కానీ అంబటి రాయుడు(72) ముంబై

బౌలర్లకు సిక్సర్లతో చుక్కలు చూపించాడు. రాయుడు కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు జడేజా(22) తో కలిసి ఐదో వికెట్ కు 102 పరుగులు జోడించారు దీంతో చెన్నై 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. పొదుపుగా బౌలింగ్ చేసే బుమ్రా ఈ మ్యాచ్లో 56 పరుగులు ఇచ్చాడు.

219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ డికాక్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 58 పరుగులు చేసింది కానీ వరుసగా 3 ఓవర్లలో ముగ్గురు బ్యాట్స్మెన్లు అవుట్ చేసి ముంబాయి నీ దెబ్బతీశారు. శార్దూల్ ఠాకూర్ రోహిత్ శర్మ(35)ని అవుట్ చేసి వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. సూర్యకుమారి(3) ని జడేజా అవుట్ చేశాడు. డికాక్(38) ని మోయిన్ అలీ అవుట్ చేశాడు. దీంతో ముంబై త్వరగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పొలార్డ్ కృనాల్ పాండ్యా తో కలిసి ముంబై నీ లక్ష్యం దిశగా నడిపించారు. ముఖ్యంగా పొలార్డ్ సులభంగా సిక్స్ లు కొట్టి మ్యాచ్ను చెన్నై నుంచి లాగేశాడు. పొలార్డ్ కేవలం 17 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కృనాల్ పాండ్యా(32) అవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా(16) రెండు భారీ

సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం ఎoగిడి వేసిన ఈ ఓవర్లో పొలార్డ్(87) రెండు ఫ్లోర్ లు సిక్సర్ బాదాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో వేగంగా పరిగెత్తి రెండు పరుగులు తీసి జట్టుని గెలిపించాడు.


Comments


bottom of page